మా ఆస్పత్రిలో అడుగుపెడితేనే సగం జబ్బు మాయం: సినీ నటుడు బాలకృష్ణ
బసవతారకం ఆస్పత్రి ఉన్నదే పేదల కోసమని, అందులో అడుగుపెడితే సగం జబ్బు మాయమవుతుందని ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
బసవతారకం ఆస్పత్రి ఉన్నదే పేదల కోసమని, అందులో అడుగుపెడితే సగం జబ్బు మాయమవుతుందని ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద పింక్ రిబ్బన్ వాక్ నిర్వహించారు. దీనికి బాలకృష్ణ, మంచు లక్ష్మి, ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. బ్రెస్ట్ కేన్సర్ కొందరిలో వారసత్వంగానూ, కొందరిలో మధ్యలోనూ వస్తుందని గుర్తు చేశారు. ఈ వ్యాధి ముదిరే వరకు చాలామంది గుర్తించలేకపోతున్నారని, అవగాహన కోసమే పింక్ రిబ్బన్ వాక్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
బ్రెస్ట్ కేన్సర్ చికిత్స చాలా ఖర్చు అవుతుందని గ్రామీణ ప్రాంతాల మహిళలు భావిస్తున్నారని, అయితే బసవతారకం కేనర్స్ ఆస్పత్రిలో అటువంటిదేమీ లేదని, ఆ ఆస్పత్రి కట్టిందే పేదల కోసమని, ఇందులో అడుగుపెడితేనే సగం వ్యాధి నయమవుతుందన్నారు. తన తల్లిగారు కేన్సర్‌తోనే మరణించారని, ఆమె గుర్తుగానే ఈ ఆస్పత్రిని నిర్మించినట్టు గుర్తు చేశారు.