శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

manoj - hema
తనను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి తొలగించడం అన్యాయమని నటి హేమ వాపోయారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. పైగా, ఈ కేసు విచారణ కోర్టులో సాగుతుందన్నారు. కోర్టులు ఇంకా తనను దోషిగా నిర్ధారించలేదన్నారు. అందువల్ల కోర్టులో దోషిగా తేల్చేంతవరకు తాను నిర్దోషినేని చెప్పారు. అందువల్ల తన మా సభ్యత్వాన్ని తిరిగి పునరుద్దరించాలని చోరారు. ఈ మేరకు మా అధ్యక్షుడు మంచు మనోజ్‌కు సోమవారం ఆమె ఓ వినతి పత్రం సమర్పించి, దాన్ని మీడియాకు బహిర్గతం చేశారు. ఇటీవల బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అసోసియేషన్‌ నుంచి హేమను సస్పెండ్‌ చేసినట్లు ‘మా’ ప్రకటించింది. ఈ  అంశంపై తాజాగా ఆమె బహిరంగ లేఖ రాశారు. దాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. తాను నిర్దోషినని పేర్కొన్నారు.
 
'మీడియా నాపై అనేక నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో నేను పరీక్షలు చేయించుకున్నా. వాటిలో నేను డ్రగ్స్‌ తీసుకోలేదని స్పష్టమైంది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లోనూ ఇవే రిజల్ట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఈలోపే నన్ను దోషిగా భావించి ‘మా’ సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదని భావిస్తున్నా. గత కొన్ని రోజులుగా నాపై జరుగుతోన్న ప్రచారం వల్ల నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. ఈ పరిస్థితుల్లో నాకు ‘మా’ అండగా ఉండాలని కోరుకుంటున్నా. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నా. ఇలాంటి ప్రచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత ‘మా’పై ఉంది. ఈ విషయాన్ని గమనించి నాపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తారని ఆశిస్తున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.