శివగామి కారులో బీరు సీసాలు, మద్యం దొరక్కపోడంతో... (Video)
శివగామి కారులో బీరు సీసాలు.. ఇదేంటి అనుకుంటున్నారా..? తమిళనాడులో వాహనాలు తనిఖీ చేస్తుండగా శివగామి అదేనండి.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వాహనంలో భారీగా బీరు సీసాలు దొరికాయి. రమ్యకృష్ణ వాహనమైన ఇన్నోవా వాహనంలో 96 బీరు సీసాలు, 8 ఫుల్ బాటిల్లు దొరకడం సంచలనం అయ్యింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే... చెన్నైలో మద్యం లభించకపోవడంతో మహాబలిపురం నుంచి మద్యం తెస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కారు నుంచి భారీ ఎత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. రమ్యకృష్ణకు చెందిన ఈ వాహనం గత రాత్రి పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా పోలీసులు తనిఖీల నిమిత్తం ఆపారు.
లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తుండటంతో పోలీసులు కారును కూడా సీజ్ చేశారు. ఇలా... రమ్యకృష్ణకు సంబంధించిన వాహనంలో బీరు బాటిళ్లు దొరకాయని వార్తల్లో రాగానే.. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు ఆరా తీయడం ఆరంభించారు. అయితే.... దీనిపై రమ్యకృష్ణ ఇంకా స్పందించలేదు. దీనిపై కనత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.