మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (16:17 IST)

బాలుగాడి లవ్ స్టోరి నుంచి బేగంపేట కుర్రాదాన్ని మామా సాంగ్ క్రేజ్

Balugadi Love Story
Balugadi Love Story
ఆకుల అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుంచి బేగంపేట లిరికల్ సాంగ్ వచ్చేసింది. కుర్రాకారును ఊపేసే బీట్‌తో ఈ పాట ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. టాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్ పృథ్వీ రాజ్ చేతుల మీదుగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వేదికగా విడుదల అయింది. 
 
ఘనశ్యామ్ సంగీతాన్ని సమకూర్చగా ఎల్ శ్రీనివాస్ తేజ్ రాసిన ఈ పాటను ఎమ్ ఎమ్ మానసి అద్భుతంగా పాడారు. ఈ ఐటెం సాంగ్ చిత్రంలో ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది అని మేకర్స్ అంటున్నారు. అంతే కాకుండా ఈ పాటకు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో అఖిల్, మేఘా దాస్ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేశారన్నారు. పాట విడుదలై శ్రోతల నుంచి విశేష స్పందన పొందుతుంది. ఇక హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ ప్లేసులు బేగం పేట, మూస పేట, నిజాం పేట వంటి ప్రాంతాలను కలుపుతూ లిరిక్ రైటర్ శ్రీనివాస్ అద్భుతంగా రాశారు. ఇక సాంగ్ హుక్ లైన్స్ అయినా మస్త్ మజా, మస్త్ మజా మస్త్ మజారే పదాలు కూడా చాలా క్యాచీగా ఉన్నాయి. పాట సౌండింగ్ గానే కూకుండా విజువల్ గా కూడా చాలా గ్రాండ్ గా ఉంది. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. 
 
ఆకుల అఖిల్, దర్శక మీనన్ హీరో హీరోయిన్లుగా. చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి నటీ నటులుగా యల్. శ్రీనివాస్ తేజ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేశారు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలుగాడి లవ్ స్టోరీ సినిమా ఆద్యాంతం నేటి యూత్ కు నచ్చేలా రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ కు మంచి విశ్వాసం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తులో సినిమా విడుదల చేస్తున్నట్లు.. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలుపుతున్నారు. ఇక సినిమాను ఖచ్చితంగా ప్రేక్షకులు ఆధారిస్తారని నమ్మకంగా ఉన్నారు.