ఆ దర్శకుడు నేను ఆఫీస్ బాయ్ అని గుర్తు చేసాడు : మురుగదాస్ (video)
ఇద్దరు ఆఫీసు బాయ్‌లు కలిసి సినిమా చేయడం విశేషం. అది దర్శకుడు మురుగదాస్ జీవితంలో సాధ్యమైంది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. 1947 అనే సినిమాను తమిళంలో నిర్మించారు మురుగదాస్. దీని నేపథ్యం గురించి ఆయన చెబుతూ.. పొన్ కుమార్ నా ఆఫీసులో టీలు, కాఫీలు అందిస్తూ, ఆఫీస్ వూడిసేవాడు. ఓరోజు షడెన్‌గా నేను దర్శకుడిని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. నేను షాక్ అయ్యాను. ఆఫీస్ బాయ్ ఇలా మాట్లాడడం ఏమిటి? అనిపించింది. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే నేను కూడా ఆఫీస్ బాయ్‌నే కదా! అనే విషయం గుర్తుకు వచ్చింది.
ఆ తర్వాత నా సినిమాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. ఓరోజు షడెన్‌గా పేట్రియాటిక్‌కథ అంటూ 1947లో స్వాతంత్య్రం రాని ఓ గ్రామం గురించి చెప్పాడు. అది వినగానే మంచి కథలా అనిపించింది. దాంతో తనకు తొలిసినిమా అయినా బడ్జెట్ పరిమితులు లేకుండా ముగ్గురు నిర్మాతలం కలిసి ఈ సినిమా తీశాం. అంటూ మురుగదాస్ వెల్లడించాడు. ఈ సినిమా ఏప్రిల్ 7న తమిళనాడులో విడుదలవుతుంది. 14న తెలుగులో విడుదలవుతుంది.