గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (15:21 IST)

నీతా అంబానీ డ్యాన్స్ అదుర్స్- వీడియో వైరల్

Nita Ambani
Nita Ambani
నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కల్చరల్ సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారలు, ప్రముఖుల సమూహాన్ని ముంబైకి ఆకర్షించింది. 
 
ప్రారంభోత్సవ కార్యక్రమానికి మొత్తం అంబానీ కుటుంబంతో పాటు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వంటి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
 
ఇక ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రఘుపతి రాఘవ రాజా రామ్‌కి నీతా అంబానీ చేసిన నృత్య ప్రదర్శన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్ అధికారిక NMACC ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. 
 
నీతా అంబానీ అందమైన గులాబీ రంగు లెహంగా, చోళీలో, భారీ ఆభరణాలతో సంక్లిష్టమైన ఎంబ్రాయిడరీ దుస్తులతో మెరిశారు. అద్భుత నృత్యంతో అదరగొట్టారు.