బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (09:39 IST)

వైవిధ్యమైన పాత్రలో రామ్ పోతినేని - మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌

Bhagya Sri Borse, Ram Pothineni
Bhagya Sri Borse, Ram Pothineni
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తన 22వ చిత్రంలో భిన్నమైన పాత్ర పోషిస్తున్నట్లు ఈరోజువిడుదలజేసిన పోస్టర్ ను బట్టి అవగతమవుతోంది. ఇందులో  మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు.
 
'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి' అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ చూస్తే... చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్కులో బావున్నారు. ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. 
 
''హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశాం. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, ఆయన నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ అని చెప్పాలి. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారు. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని అందరూ చెబుతున్నారు. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి'' అని దర్శక నిర్మాతలు తెలిపారు. 
 
సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. 'మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్' అంటూ ఇటీవల రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేశారు. పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు... ఆ లుక్ చూడగానే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోందని ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఒక్క లుక్ ద్వారా సినిమాపై అంచనాలు పెంచారు దర్శకుడు మహేష్ బాబు పి.