బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (16:29 IST)

హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న భోజ్‌పురి నటి

akanksha
చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. హోటల్ గదిలో భోజ్‌పురి నటి ఆత్మహత్య చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ హోటల్‌ గదిలో ఆమె ఉరేసుకుంది. ఆ నటి పేరు ఆకాంక్ష దూబే. వయసు 25 సంవత్సరాలు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకుని సోమేంద్ర హోటల్ గదికి వచ్చిన ఆమె... ఆదివారం ఉదయానికి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈమె గత కొంతకాలంగా సమర్ సింగ్‌తో రిలేషన్‍‌లో ఉన్నట్టు సమాచారం. సమర్ సింగ్‌పై తన ప్రేమను కూడా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం కూడా చేశారు. అయితే, ఆకాంక్ష ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 
 
కాగా, 1997 అక్టోబరు 21వ తేదీన యూపీలోని మీర్జాపూర్‌లో జన్మించిన ఆకాంక్ష.. సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోయర్స్ కూడా ఉన్నారు ఇదిలావుండగా, ఆమె ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఆ వీడియో సాంగ్‌లో ఆకాంక్ష భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్‌తో కలిసి నటించారు.