శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (12:30 IST)

హీరో అజిత్ కుమార్‌కు పితృవియోగం.. అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూత

ajith father
కోలీవుడ్ అగ్రనటుడు అజిత్ కుమార్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి పీ.ఎస్.మణి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 85 యేళ్లు. గత నాలుగేళ్లుగా ఆయన మంచానికే పరిమితమైవున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఉదయం నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు అజిత్ కుటుంబ సభ్యులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కాగా, నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన తండ్రికి ప్రేమతో వైద్యం చేసిన వైద్యులకు, వైద్య సిబ్బందికి, కుటుంబ సభ్యులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడివుంటామన్నారు. మా నాన్నగారు దాదాపు అరవై ఏళ్లపాటు మా అమ్మ ప్రేమ, అంకితభావంతో మంచి జీవితాన్ని గడిపారని అజిత్ పేర్కొన్నారు. 
 
ఈ విషాద సమయంలో, మా నాన్న మరణవార్త గురించి ఆరా తీయడానికి, మా కుటుంబాలను ఓదార్చడానికి చాలా మంది మాకు ఫోన్, మొబైల్ లేదా మెసేజ్‌లు పంపుతుంటారు. ప్రస్తుత వాతావరణంలో మీ కాల్‌కు లేదా ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నామని అర్థం చేసుకోండి. మా నాన్నగారి అంత్యక్రియలను కుటుంబ సమేతంగా నిర్వహిస్తాం. కావున, ఈ మరణం గురించి తెలిసిన వారందరూ మా బాధను, నష్టాన్ని అర్థం చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంతాపాన్ని పాటించి అంత్యక్రియలు ఏకాంతంగా నిర్వహించాలని ప్రార్థిస్తున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.