1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Filmmaker Pradeep Sarkar Dies At 67, Ajay Devgn And Other Stars Pay Tribute

బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఇకలేరు..

pradeep sarkar
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. దిగ్గజ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూశారు. 68 యేళ్ళ ప్రదీప్ కుమార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 
 
ప్రదీప్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వచ్చారు. శరీరంలో పొటాషియం నిల్వలు క్రమంగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రదీప్ సర్కార్ మృతి ఆయన సోదరి మాధూరి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
కాగా, ప్రదీప్ సర్కార్ మృతిపై బాలీవుడ్ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్టు అగ్ర నటుడు అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
 
కాగా, చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు ప్రదీప్ సర్కార్ మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య వీడియోలు చేస్తుండేవారు. 2005లో వచ్చిన "పరిణీతి" మూవీతో ఆయన బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. తన తొలి చిత్రంతోనే ఆయన తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 
 
ఆ చిత్రంలో బాలీవుడ్ నటులు విద్యాబాలన్, సైఫ్ అలీఖాన్, సంజయ్ దత్ తదితరులు నటించారు. ఆ తర్వాత లగా చునారీ దాగ్, మర్దానీ, హెలికాఫ్టర్ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. బాలీవుడ్‌కు ఆయన ఎంతో మంది స్టార్స్‌ను పరిచయం చేశారు. 
తర్వాతి కథనం
పుష్ప2లోనూ అల్లు అర్జున్‌ మేనరిజం ఎలా వుంటుందంటే!