1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: గురువారం, 23 మార్చి 2023 (08:00 IST)

విశాఖపట్టణంలో విషాదం.. భవనం కూలి ఇద్దరి మృతి

building collapse
విశాఖపట్టణంలో విషాదం చోటుచేసుకుంది. వైజాగ్ కలెక్టరేట కార్యాలయ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్థరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో బాలిక సాకేటి అంజలి (14), దుర్గాప్రసాద్‌(17) మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. 
 
ఉన్నట్టుండి భవనం కూలిపోయిన ఘటనతో పరిసర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. మరోక వ్యక్తి  చోటు ఆచూకీ కోసం శిథిలాల కింద గాలింపు చేపట్టారు. గాయపడిన ఐదుగురిని కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీసీపీ సుమిత్‌ గరుడ పరిశీలించారు.