గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (11:52 IST)

భోళాశంకర్ నుంచి తాజా అప్డేట్

Bhola shankar
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ వచ్చింది. భోళా శంకర్' మూవీ షూటింగ్ మొదలు అయి చాలా రోజులు అవుతుంది. 
 
కానీ ఈ సినిమా నుంచి ఒక్క ప్రీ లుక్ తప్ప మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు టాలీవుడ్‌లో ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.  
 
భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నున్నారు. అయితే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిరంజీవి జోడీగా న‌టిస్తున్నారు.