ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 24 జులై 2019 (22:36 IST)

బిగ్ బాస్ రెండో రోజే మొద‌లెట్టేసారుగా.. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో..?(Video)

బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2... ఈ రెండు సీజ‌న్స్ స‌క్స‌ెస్ అవ్వ‌డంతో బిగ్ బాస్ 3పై ఆస‌క్తి ఏర్ప‌డింది. దీనికి న‌వ మ‌న్మ‌థుడు నాగార్జున హోస్ట్ కావ‌డంతో మ‌రింత ఇంట్ర‌ెస్ట్ క్రియేట్ అయ్యింది. ఫ‌స్ట్ డే నాగార్జున త‌న‌దైన శైలిలో హోస్ట్‌గా అద‌ర‌గొట్టేసాడు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎక్కువమందిని పంప‌డానికి కార‌ణం... వారిని ఇబ్బందికర పరిస్థితుల్లో వుంచి... ఒకరితో ఒకరు గొడవలు పడతారనే ఉద్దేశంతోనే. 
 
బిగ్ బాస్ హౌస్‌లో వాళ్లు ఒక‌రిపై ఒక‌రు చాడీలు చెప్పుకుని ఎంత‌ గొడవ పడితే జనాలకి అంత ఎంటర్‌టైన్‌మెంట్‌. ఎందుకంటే.. మ‌న లేడీస్‌కి వాళ్ల ఇంట్లో ఏం జ‌రుగుతుంది అనే దాని కంటే పక్కింట్లో జరిగే గొడవలని ఆసక్తిగా చూస్తుంటారు క‌దా. అందుక‌నే జ‌నాల మ‌నసుల‌కు అనుగుణంగానే ఈ గేమ్‌ రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ షో సూపర్ స‌క్స‌స్ అయింది. తెలుగునాట అయితే ఈ షోలో పాల్గొన్న వారికి ఫ్యాన్ ఆర్మీలు తయారయ్యేంతగా క్లిక్‌ అయింది. 
 
ఈ నేపథ్యంలో తెలుగు బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌లో షోపై ఇంట్ర‌స్ట్ క్రియేట్ అవ్వ‌డానికి.. గొడ‌వ‌లు జ‌రగ‌డానికి ఎక్కువ టైమ్ ప‌డుతుందేమో అనుకుంటే... రెండో రోజే గొడ‌వ‌లు స్టార్టయ్యి అంద‌రికీ ఆశ్య‌ర్యం క‌లిగించాయి. అంతా అనుకున్నట్టుగానే ఈ గొడవలో హేమ ముఖ్య పాత్ర పోషించింది.

మామూలుగానే జగడాలమారి అయిన హేమ ఇలాంటి హౌస్‌లో కుదురుగా వుంటుందని ఎవరూ అనుకోరు. మరోవైపు శ్రీముఖి డామినెంట్‌ పర్సనాలిటీకి తోడు గొడవలని ప్రేరేపించే వ్యక్తిగా కనిపిస్తోంది. చాలా సున్నిత మ‌న‌స్కురాలైన హిమ‌జ ఈ షో ద్వారా ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. మ‌రి.. నాగార్జున వీళ్ల‌కి ఎలాంటి క్లాస్ తీసుకుంటాడో చూడాలి.