సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (18:35 IST)

బిగ్‌బాస్-3 పాల్గొనేవారు వీరే... శ్రీరెడ్డిని అందుకే తీసుకోలేదా? (video)

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున ప్రధాన హోస్ట్‌గా ప్రముఖ టీవీ చానెల్‌లో అతిపెద్ద రియాల్టీ షో ప్రసారం ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఆదివారం రాత్రి 9 గంటలకు మొదలైన ఈ షో.. మరో వంద రోజుల పాటు ఆలరించనుంది. అయితే, ఈ షోలో పాల్గొనే వారి వివరాలను తొలి రోజైన ఆదివారం వెల్లడించారు. ఈ బిగ్ బాస్ మూడో సీజన్‌లో హీరో అక్కినేని తనదైనశైలిలో కార్యక్రమాన్ని రక్తికట్టించారు. 
 
అయితే, ఈ షోకు క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పబ్లిసిటీని దక్కించుకున్న సినీ నటి శ్రీరెడ్డి కూడా పాల్గొనబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆదివారం వెల్లడించిన కంటెస్టెంట్ల జాబితాలో శ్రీరెడ్డి పేరు లేదు. దీనికి కారణాలను పలు విధాలుగా విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే... శ్రీరెడ్డి ఇండస్ట్రీ తెరవెనుక మరోలా ప్రవర్తిస్తుదనే ఆరోపణలు లేకపోలేదు. 
 
ముఖ్యంగా, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు కుమారుడుతో ఆమె జరిపిన శృంగారలీలల వీడియోలు సంచలనమైన విషయం తెల్సిందే. అలాంటి శ్రీరెడ్డిని ఈ షోలోకి తీసుకున్నట్టయితే లేనిపోని సమస్యలతో పాటు.. షో కాన్సెప్ట్ దెబ్బతినే అవకాశం ఉందని భావించిన నిర్వాహకులు ఆమెను తీసుకోలేదని తెలుస్తోంది. కాగా, ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ జాబితా ఇదే. 
 
శివజ్యోతి (తీర్మాన్ సావిత్రి), రవికృష్ణ (బుల్లితెర నటుడు), ఆషు రెడ్డి (డబ్ స్మాష్ ఆర్టిస్ట్), జాఫర్ (టీవీ 9 రిపోర్టర్), హిమజ (టీవీ నటి), రాహుల్ సిప్లగంజ్ (సింగర్), రోహిణి (టీవీ నటి), బాబా భాస్కర్ (కొరియో గ్రాఫర్), పునర్నవి భూపాలం (నటి), హేమ (సినీ నటి), అలీ రాజా (టీవీ నటుడు), మహేష్ (కామెడీ ఆర్టిస్ట్), శ్రీముఖి (యాంకర్), వరుణ్ సందేశ్ (హీరో), వితికా షేరు (వరుణ్ సందేశ్ భార్య).