సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 18 జులై 2019 (20:50 IST)

ఇంట్లో ఉండాలంటేనే వణికిపోతున్న నాగార్జున.. ఏమైంది?

కింగ్ నాగార్జున ఇంటిలో ఉండాలనే భయపడిపోతున్నారు. ఎటువైపు ఏ ఉపద్రవం వస్తుందో తెలియక వణికిపోతున్నారు. విద్యార్థి సంఘాలు తన ఇంటిని ముట్టడించి ఏం చేస్తారో అర్థంకాక ఆలోచనలో పడ్డారు. దీనికంతటికి కారణం బిస్ బాస్-3 అని తెలుసుకున్నారు నాగార్జున.
 
బిగ్ బాస్-2 ఎపిసోడ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇందులో హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. తన సొంత ఛానల్ మాటివీలో ఇది ప్రసారం కాబోతోంది. ఇప్పటికే బిగ్ బాస్-1, బిగ్ బాస్-2 ఏ స్థాయిలో ప్రేక్షకులు ఆదరించారో తెలిసిందే.
 
అయితే బిగ్ బాస్ ఎపిసోడ్‌ మహిళలను కించపరిచేలా ఉందని ఇప్పటికే మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు హైకోర్టుకు కూడా వెళ్ళాయి. అయితే బిగ్ బాస్ నిర్వాహకులకే అనుకూలంగా తీర్పు వచ్చింది. 
 
అయినా కూడా విద్యార్థి సంఘాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాగార్జున బిగ్ బాస్-3 సీజన్లో నటించకూడదంటూ ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఓయు విద్యార్థులు ఇప్పటికే నాగార్జున ఇంటిని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రికత్త నెలకొంది. నాగార్జున ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణం ఏం జరుగుతుందన్న భయంలో అక్కినేని కుటుంబం ఉంది.