ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 18 జులై 2019 (15:05 IST)

బిగ్ బాస్ కేసుపై హైకోర్ట్ రియాక్ష‌న్ ఏంటి..?

బిగ్ బాస్ షో నిర్వాహ‌కులపై యాంకర్‌, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మహిళలను కించపరిచే బిగ్ బాస్ షోను రద్దు చేయాలని ఓయూ ఐక్య విద్యార్ధి సంఘాల డిమాండ్ చేసింది. బిగ్ బాస్ రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తాం అని ఓయూ ఐక్య సంఘాలు తెలియ‌చేసాయి. 
 
బిగ్ బాస్ షో నిర్వాకులపై నమోదైన కేసులు కొట్టివేయలని క్వాష్ పిటిషన్ వేసారు. బంజారాహిల్స్ రాయదుర్గంలో నమోదు అయిన కేసులు కొట్టివేయలని కోర్టి ను పిటిషనర్లు కోరారు. అయితే...బిగ్ బాస్ షో నిర్వాహకులు పై నమోదు అయిన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసుల‌కు, పిటిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు బిగ్ బాస్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేయవద్దని పోలీసుల‌కి చెప్పి తదుపరి విచారణ వచ్చే బుధవారంకి వాయిదా వేసింది.