శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జులై 2019 (17:38 IST)

చందన బ్రదర్స్ గెస్ట్ హౌస్ కూల్చివేతపై హైకోర్టు స్టే

కృష్ణా నది తీరంలో కరకట్టపై నిర్మించిన చందన బ్రదర్స్ గెస్ట్ హౌస్‌కు సీఆర్డీఏ నోటీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వారాల స్టే ఇచ్చింది. పైగా, సీఆర్డీఏకి అసలు నోటీసులు ఇచ్చే అధికారమే లేదని వాదించిన పిటిషనర్.... సీఆర్డీఏ చట్టం రాకముందే తమ భవనాలు ఉన్నాయని  వాదించారు. 
 
2006లో భవనాలు నిర్మిస్తే సీఆర్డీఏ చట్టం 2014 తర్వాత వచ్చిందన్న పిటిషనర్ వాదించారు. నదీ తీరంలో అనుమతులు లేకుంటే జరిమానాలు విధించవచ్చు. అంతేకానీ, భవనాలు కూల్చడం సరికాదన్న పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. దీంతో సీఆర్డీఏ నోటీసులపై మూడు వారాల పాటు న్యాయమూర్తి ఉప్మాక దుర్గా ప్రసాద్ స్టే విధించారు.