శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (14:19 IST)

చంద్రబాబు నివసించే లింగమనేని గెస్ట్‌హౌస్‌ ప్రత్యేకతలేంటి?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్టకు సమీపంలో అధునాతన హంగులతో నిర్మించిన లింగమనేని గెహౌస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్, చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలతో పాటు మనువడు దేవాన్ష్‌లు ఈ ఇంటిలో నివాసం ఉంటున్నారు. 
 
ఇపుడు ఈ ఇంటిపై వివాదం నెలకొంది. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కరకట్టపై ప్రభుత్వం రూ.8.90 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. దీంతో చంద్రబాబు నివసించే ఇంటిని కూల్చివేయొచ్చనే సంకేతాలు వెళుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఉండే ఇల్లు (గెస్ట్ హౌస్) ప్రత్యేకతలేంటో ఓసారి తెలుసుకుందాం. లింగమనేని కట్టించిన ఈ గెస్ట్‌హౌస్ నివాసయోగ్యంగా ఉండటంతో పాటు సమావేశాలు నిర్వహించడానికి కూడా అనువుగా ఉంది. దీంతో చంద్రబాబు ఇక్కడ ఉంటున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ గెస్ట్‌హౌస్ ఉంది. ఈ గెస్ట్‌హౌస్‌లో నాలుగు బెడ్ రూమ్‌లు, రెండు పెద్ద గదులు, హోం థియేటర్, అప్పటి సీఎం చంద్రబాబు సిబ్బంది ఉండేందుకు అనువుగా కొన్ని గదులు, మినీ కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. 
 
ఈ గెస్ట్‌హౌస్‌కు ఆనుకుని ఒకటిన్నర ఎకరాలో హెలిప్యాడ్‌ ఉంది. ఈ గెస్ట్ హౌస్‌ను లింగమనేని అక్రమంగా కట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ గెస్ట్ హౌస్‌ను కూల్చేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.