సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (12:20 IST)

ప్రజా వేదిక భవనాన్ని కూల్చేస్తాం.. తప్పు చేసినట్లు తేలితే?: జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉండవల్లిలోని ప్ర‌జావేదిక‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అవినీతిని ఏమాత్రం ఉపేక్షించవద్దని కలెక్టర్లకు సూచనలు చేశారు.


ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా స‌రే అవినీతి పట్ల క‌ఠినంగా వ్వ‌వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి అర్హుడికి అందాలని జగన్ వెల్లడించారు. 
 
ఇందుకోసం గ్రామ సచివాలయం, వలంటీర్లు ముఖ్య పాత్ర పోషించబోతున్నారని సీఎం పేర్కొన్నారు. ఒక వేల వాలంటీర్లు అవినీతికి పాల్ప‌డితే సీఎంవోకు స‌మాచారం అంద‌జేయ‌వ‌చ్చ‌ని, త‌ప్పు చేసిన‌ట్లు తేలితే వారి స్థానంలో కొత్త వారిని నియ‌మించాల‌ని కోరారు.
 
మనం కూర్చున్న ప్రజా వేదిక భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదే అన్నారు. ప్రజావేదిక నుంచే అక్రమ కట్టడాల కూల్చివేత మొదలవుతుందన్నారు. ఎల్లుండి నుంచి ప్రజావేదికను కూల్చేస్తామని జగన్ చెప్పారు. 
 
ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం అన్నారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చెప్పడానికే ప్రజా వేదికలో సమావేశం పెట్టానన్నారు. మనం పాలకులం కాదు సేవకులమన్న విషయం గుర్తు ఉంచుకోవాలనుకున్నారు.