శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (11:40 IST)

బిగ్ బాస్ తొలి ఎపిసోడ్.. ట్రెండింగ్‌లో నెం.1.. నాగ్ థ్యాంక్స్ ట్వీట్

టాలీవుడ్‌లో బిగ్ బాస్ మూడో సీజన్ సందడి మొదలైంది. తాజాగా బిగ్ బాస్‌-3కి సంబంధించిన నాగార్జున ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఎలాంటి ట్వీట్ చేశారంటే.. గత రాత్రి, ప్రపంచంలోనే బిగ్ బాస్ తెలుగు స్టార్టింగ్ ఎపిసోడ్ నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంపై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా.. టాలీవుడ్‌లో అతిపెద్ద బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తొలిరోజు షోలో భాగంగా నాగార్జున ఒక్కో కంటెస్టెంట్‌నూ పరిచయం చేసి, హౌస్‌లోకి పంపించారు. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు వీక్షించారు. ఇక అదే విషయాన్ని సోమవారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో నాగార్జున ప్రస్తావించారు.