బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (12:32 IST)

ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #TNRejectsBJP...

తమిళనాడులో బీజేపీ అంటేనే ప్రజలు అంతెత్తున లేస్తారు. నీట్, స్టెర్‌లైట్, కావేరీ, హైడ్రో కార్బన్ పథకాలతో తమిళ ప్రజలు బీజేపీ అంటేనే గుర్రుగా వున్నారు. గత రెండేళ్లుగా వేరే గత్యంతరం లేక కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మద్దతు తెలిపింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వున్న కాలంలో బీజేపీని ఏమాత్రం ఆమె లెక్క చేసేది కాదు. 
 
ఇక డీఎంకే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రధాని మోదీ తమిళనాడుకు వచ్చినప్పుడల్లా నల్ల జెండాలను చేతిలో పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మోదీ అంటేనే తమిళ ప్రజలకు, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు పడదు. తాజాగా 17వ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం #TNRejectsBJP అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ సర్కారు విజయోత్సాహంలో వుంటే.. తమిళనాడులో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ లేవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.