మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (12:59 IST)

#1ONTRENDING హిప్పీ ట్రైలర్.. కార్తీకేయ ముద్దులకు బాగా మరిగాడా..? (ట్రైలర్)

కార్తీకేయ తాజా సినిమా హిప్పీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్‌లో కూర్చుంది. ఆర్‌‌ఎక్స్ 100 సినిమాకు ముందు కార్తీకేయ అంటే ఎవ్వరికీ తెలియదు. అంత‌కుముందు ఓ సినిమా చేశాడు గానీ అంత గుర్తింపు రాలేదు. కానీ ఒక్క‌సారిగా ఆర్‌‌ఎక్స్ 100తో టపాసులా పేలాడు కార్తికేయ‌. ముద్దులు, ఘాటు సీన్ల పుణ్యంతో బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఫలితంగా ఒక్క‌సారిగా కార్తికేయ‌కు ఫేమ్ వ‌చ్చేసింది. అంతేగాకుండా సినిమాకి కోటి రూపాయ‌లు ఇచ్చి క‌థానాయ‌కుడిగా బుక్ అయ్యాడు. అలా వ‌చ్చిన క‌థ‌ల్లో జ‌ల్లెడ ప‌ట్టి ''హిప్పీ'' అనే సినిమాని ఎంచుకున్నాడు. ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. కొత్త గెటప్ కోసం కసరత్తులు చేశాడు. 
 
అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సంగతికి వస్తే.. ఆర్‌‌ఎక్స్ 100 నుంచి కార్తీకేయ బ‌య‌ట‌ప‌డ‌లేదేమో అనిపిస్తోంది. ఇందులో ప్లేబాయ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు కార్తికేయ‌. 30 సెక‌న్ల టీజ‌ర్లో రెండు ఘాటు ముద్దులు క‌నిపించాయి. ఆర్ఎక్స్‌లో ముద్దులకు ఏం కొదవలేదు. ఇక హిప్పీ టీజ‌ర్లోనే రెండు వ‌దిలాడంటే… సినిమాలో ఇంకెన్ని ఉన్నాయోనని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి కార్తికేయ ముద్దుల రుచి మ‌రిగాడేమోనని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
ఈ ట్రైలర్‌లో ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో దాన్ని పట్టుకున్నారు.. అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు తెలుసా.. అంటూ వెన్నెల కిషోర్ చెప్తున్న డైలాగ్‌ని బట్టి కార్తికేయ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ప్లే బాయ్ అవతారంలో అమ్మాయిల్ని లిప్ లాక్ చేస్తూనే సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సర్‌గా పవర్ ఫుల్ కిక్‌లు ఇస్తున్నాడు.