సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (15:19 IST)

ముగ్గురు హీరోయిన్లతో కార్తికేయ రొమాన్స్ : 'హిప్పీ' నుంచి ఫస్ట్ పోస్టర్

"ఆర్ఎక్స్ 100" మూవీ హీరో కార్తికేయ. ఈ కుర్రోడు నటించిన తొలి చిత్రమే బాక్సాఫీస్ హిట్ కొట్టేసింది. నిర్మాతకు, బయ్యర్లకు కాసులవర్షం కురిపించింది. దీంతో హీరోకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కబాలి' వంటి భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ హిప్పీ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతోంది. 
 
తమిళ దర్శకుడు టి.ఎన్.కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించనుండ‌గా, ఈ చిత్రంలో కార్తికేయ బాక్స‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఇందులో కార్తికేయ స‌ర‌స‌న ముంబై భామ‌లు దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్‌లని క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి స‌ర్‌ప్రైజింగ్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో ఇద్ద‌రు భామ‌ల‌తో క‌లిసి హీరో కార్తికేయ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.