టిక్ టాక్ యాప్..?
నేటి తరుణంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ టిక్ టాక్. సినిమాల్లో పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ వంటి వాటిని ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చును. గతంలో వచ్చిన డబ్ స్మాష్ లానే ఇది కూడా ఉంటుంది. కాకపోతే.. ఇది మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇదంతా ఓ వైపు మాత్రమే. ఈ యాప్‌ను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు.
అశ్లీల చిత్రాలు, పలువర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు. అందువలన ఈ యాప్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం.. ఈ టిక్ టాక్ వీడియోలు చేసేందుకు యువత ఎన్ని ప్రయోగాలు అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అశ్లీల చిత్రాలు, మతపరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా కొందరు టిక్ టాక్‌లో వీడియోలను తయారుచేస్తున్నారు.
జూన్‌లో 2018, టిక్ టాక్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ నెలవారీ క్రియాశీల వినియోగదారులు, చైనాలో 150 మిలియన్ రోజువారీ క్రియాశీల వినియోగదారులు చేరుకుంది. ఇది ఆపిల్ యొక్క యాప్ స్టోర్లో ప్రపంచంలోని అత్యంత డౌన్లోడ్ చేసిన యాప్. బ్లూవేల్ గేమ్ మాదిరిగానే ఇది కూడా ప్రమాదకరమైనదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో 25 మిలియన్ల మంది ఈ యాప్‌ని వినియోగిస్తున్నారు.