ప్రతిరోజూ లక్షలాది యాడ్స్‌ను బ్యాన్ చేస్తున్న గూగుల్

కుమార్| Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (13:12 IST)
ఆన్‌లైన్ వినియోగదారుల భద్రతను ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. వినియోగదారులకు హాని కలిగించే లేదా తప్పుదారి పట్టించే ఎటువంటి అంశాలను అయినా గూగుల్ నిషేధిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో 2018లో వినియోగదారులకు హాని కలిగించే ఉద్దేశంతో ప్రదర్శించబడిన కొన్ని కోట్ల వ్యాపార ప్రకటనలను నిషేధించినట్లు గూగుల్ తాజాగా వెల్లడించింది.

గతేడాది రోజుకు కనీసం 6 లక్షల వ్యాపార
ప్రకటనలు వినియోగదారులను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ప్రదర్శించబడ్డాయని, వాటన్నింటినీ నిషేధించామని పేర్కొంది. 2018లో మొత్తంగా 230 కోట్ల ప్రకటనలను ఇంటర్నెట్ నుండి నిషేధించినట్లు గూగుల్ ప్రకటించింది. 2018 ఏడాది బ్యాడ్ యాడ్ రిపోర్ట్‌లో గూగుల్ ఈ వివరాలను వెల్లడించింది. ప్రతి వినియోగదారుని భద్రతకు, వారికి స్థిరమైన ప్రకటనలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నామని గూగుల్ తెలియజేసింది.

అంతేకాకుండా గూగుల్ ఇప్పటి వరకు 7,34,000 మంది యాడ్ డెవలపర్స్, ప్రచురణకర్తలను యాడ్ నెట్‌వర్క్ నుండి నిషేధించింది. వినియోగదారుల భద్రతకు ముప్పును కలిగించే 1.5 మిలియన్ల అప్లికేషన్‌లను కూడా తొలగించింది.దీనిపై మరింత చదవండి :