బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (22:27 IST)

ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

అమరావతి: ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ఇవ్వడానికి వారి వివరాలు కోరుతున్నట్లు అకాడమీ అధ్యక్షుడు తాటికొండ విజయకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 20వ తేదీ లోపల వివరాలను ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ, 04-006-597, అంజయ్య రోడ్డు, కార్తీకేయ హాస్పటల్ పక్కన, ఒంగోలు-523002కు పంపాలని తెలిపారు.
 
ఏప్రిల్ 27న ఉగాది పురస్కార సత్కారాల కార్యక్రమం నిర్వహిస్తారు. కళ, విద్య, వైద్య, సామాజిక సేవ, విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, విశిష్ట ప్రతిభ కనపచిన జర్నలిస్టులు, ఇంకా ఇతర రంగాలకు చెందిన 108 మందికి ఈ పురస్కారాలు అందజేస్తారు. 32 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థ గతంలో సినీరంగానికి చెందిన ప్రముఖులు అక్కినేని నాగేశ్వర రావు, టీఎల్ కాంతారావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, డాక్టర్ సి.నారాయణ రెడ్డి, వి.రామకృష్ణ, వాణీజయరామ్ తదితరులను సత్కరించింది.
 
తిరుపతిలో ఘంటసాల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసింది. 2014 మే 12 నుంచి ఆగస్ట్ 28 వరకు 108 రోజులు ఘంటసాల పాడిన పాటలతో ఆరాధనోత్సవాలు నిర్వహించింది.