సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (13:38 IST)

కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్‌.. జుకర్ బర్గ్ ఏమన్నారు? జర్మనీ యూజర్ల డేటా?

సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. యూజర్ల సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన విషయంలో ఫేస్‌బుక్ విఫలమైంది. దీంతో ఫేస్‌బుక్‌కు కొత్త సమస్యలు ఎదురైనాయి. జర్మనీలోని మూ

సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. యూజర్ల సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన విషయంలో ఫేస్‌బుక్ విఫలమైంది. దీంతో ఫేస్‌బుక్‌కు కొత్త సమస్యలు ఎదురైనాయి. జర్మనీలోని మూడు కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని అనధికారికంగా మూడో పక్షం వినియోగించకుండా రక్షణ చర్యలు చేపట్టిందీ, లేనిదీ తెలియజేయాలని జర్మనీ కోరింది. 
 
జర్మనీ న్యాయ మంత్రి కటారినా బార్లే సమన్లు పంపారు. జర్మనీకి చెందిన మూడు కోట్ల మంది యూజర్ల డేటాకు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు స్పష్టమైన నిబంధనలు అవసరమని.. ఇది ప్రజాస్వామ్యానికే ముప్పంటూ కటారినా బార్లే అభిప్రాయం వ్యక్తం చేశారు. యూజర్ల సమాచారాన్ని కాపాడటంలో విఫలమైన ఎఫ్‌బీ వివరణ ఇవ్వాలని.. అవసరమైతే ఫేస్‌బుక్ మార్క్ జుకెర్ బర్గ్‌కు సమన్లు పంపుతామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు ఎఫ్‌బీ ఖాతాదారుల సమాచారం దుర్వినియోగం అయ్యిందనే ఆరోపణలపై ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ నోరు విప్పారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్‌పై జుకర్ బర్గ్ వివరణ ఇచ్చారు. రెండు సంస్థల మధ్య జరిగిన విశ్వాసాల ఉల్లంఘన ఇదని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని  జుకర్ బర్గ్ హామీ ఇచ్చారు.  
 
ఫేస్‌ బుక్ వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్‌లు దుర్వినియోగం చేస్తున్నాయని, వీటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ తరహా యాప్‌లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు.