మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 5 ఆగస్టు 2017 (18:58 IST)

తమిళ బిగ్ బాస్... నటి ఒవియా సూసైడ్ ఎటెంప్ట్... కమల్ పొలిటికల్ దుమారం(వీడియో)

తమిళ బిగ్ బాస్ ఆది నుంచి గందరగోళంగా సాగుతోంది. షో ప్రారంభ సమయంలో ఈ షోలో పాల్గొనేవారి జాబితా ప్రకటించగానే సోషల్ మీడియాలో ఓ రేంజిలో సెటైర్లు పడిపోయాయి. ఇదిలావుండగానే షో చప్పగా సాగుతుందనగానే హఠాత్తుగా ఈ షోకి పని చేస్తున్న ముంబయికి చెందిన 28 ఏళ్ల ఇబ్రహీం

తమిళ బిగ్ బాస్ ఆది నుంచి గందరగోళంగా సాగుతోంది. షో ప్రారంభ సమయంలో ఈ షోలో పాల్గొనేవారి జాబితా ప్రకటించగానే సోషల్ మీడియాలో ఓ రేంజిలో సెటైర్లు పడిపోయాయి. ఇదిలావుండగానే షో చప్పగా సాగుతుందనగానే హఠాత్తుగా ఈ షోకి పని చేస్తున్న ముంబయికి చెందిన 28 ఏళ్ల ఇబ్రహీం షేక్ ఫిట్స్‌తో మరణించడంతో షాక్ తిన్నారు. 
 
మరోవైపు షో హోస్టుగా వున్న కమల్ హాసన్ ఈ వేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఛాన్స్ దొరికితే ఆటాడేసుకుంటున్నారు. మామూలుగా అయితే ఆయన మాటలకు అంత వెయిట్ వుంటుందో లేదో కానీ బిగ్ బాస్ వేదికగా చేస్తున్న విమర్శలు తమిళనాడు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
 
ఇదిలావుండగానే ఈ షోలో పాల్గొన్న నటి ఒవియా స్విమ్మింగ్‌పూల్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ముక్కుమూసుకుని మునిగిపోయింది. అది గమనించిన మిగిలిన వాళ్లు ఆమెను బయటకు లాగి రక్షించారు. తన బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్ ఆరావ్‌ను ఒవియా ప్రేమిస్తోందట. 
 
ఐతే ఏమైందో తెలియదు కాని అతడామెను దూరంగా పెట్టేసేసరికి ఆమె స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ముక్కుమూసుకొని సూసైడ్ ఎటెంప్ట్ చేసిందిట. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. కాగా తమిళ బిగ్ బాస్ లో ఇప్పుడు ఒవియా పేరు మారుమోగిపోతోంది. చూడండి వీడియో...