గురువారం, 23 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated: సోమవారం, 5 డిశెంబరు 2022 (11:29 IST)

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫైమా ఎలిమినేషన్.. ఫైనల్స్‌కు చేరిన శ్రీహాన్

faima
బిగ్ హాస్ హౌస్ నుంచి ఫైమా నిష్క్రమించింది. వారం రోజుల క్రితమే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ ఆమె ఎలిమినేషన్ ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించలేక పోయారు. బిగ్ బాస్ హౌస్‌కు ఫైమా తల్లి వచ్చినపుడు శ్రీ సత్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. అదే ఎపిసోడ్‌‍లో శ్రీసత్య తల్లి పరిస్థితిని చూసి ఆడియన్స్ చలించిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఫైమా తల్లి .. శ్రీ సత్యను గురించి అలా మాట్లాడటం ఫైమా ఎనిమినేషన్‌కి కారణం కావొచ్చనే టాక్ వినిపిస్తుంది. 
 
మరోవైపు బిగ్ బాస్ ఫైన‌ల్‌కు శ్రీహాన్ చేరుకున్నాడు. ఆదివారం రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం రోజున రేవంత్ తొందరపాటు, ఆయన ఆవేశం కారణంగా ఆయన టికెట్ టు ఫినాలే గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఆ ఛాన్స్ శ్రీహాన్‌కు వరించింది. అలాగే, ఎలాంటి పోటీ లేకుండానే ఆయన ఫైనల్స్‌కు చేరుకున్నాడు.