ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (14:33 IST)

దీప్తిపై బిగ్ బాంబ్‌.. ఈ వారం హౌస్‌లో అందరి ప్లేట్‌లు కడగాలి

బిగ్ బాస్ సీజన్ 2 చివరి అధ్యాయం సమీపించనుంది. నిన్నటికి 85వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న ఈ షో 17 మంది కంటెస్టెంట్స్‌తో ఇక 15 ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉండగా చివరిగా 8 మంది ఇంట్లో ఉన్నారు. ఇక నిన్న, మొన్నట

బిగ్ బాస్ సీజన్ 2 చివరి అధ్యాయం సమీపించనుంది. నిన్నటికి 85వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న ఈ షో 17 మంది కంటెస్టెంట్స్‌తో ఇక 15 ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉండగా చివరిగా 8 మంది ఇంట్లో ఉన్నారు. ఇక నిన్న, మొన్నటి ఎపిసోడ్‌ల విషయానికి వస్తే, సామాన్యుల కోటాలో వచ్చిన గణేష్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్లు శనివారం ఎపిసోడ్‌లోనే నాని చెప్పేసాడు. 
 
అతడిని బట్టలు సర్దుకుని ఇంటి నుండి స్టేజి మీదకు రమ్మన్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో గణేష్ జర్నీని చూపించారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరితోనైనా ఇద్దరితో మాట్లాడే అవకాశం కల్పించగా హౌస్‌లో ఉన్న గీతా మాధురి, దీప్తి నల్లమోతు అక్కలంటే నాకు చాలా ఇష్టమని, వారి తనకు చాలా సపోర్ట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. ఇద్దరినీ కాన్ఫిడెంట్‌గా ఆడమని సలహా ఇచ్చాడు.
 
అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఇక్కడి వరకూ రావడానికి ప్రేక్షకుల ఆదరణే కారణం. వాళ్లే నా దేవుళ్లు. వాళ్లు లేకపోతే నేను లేను. ఇక్కడకు వచ్చాక లైఫ్ అంటే ఏంటో తెలిసింది, అంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఆపై బిగ్ బాంబ్ అస్త్రంతో ఈ వారం ఎవరిపై పడితే వారు ఈ వారమంతే కిందే పడుకోవాలని చెప్పగా, మరో ఆలోచన లేకుండా కౌషల్ పేరు చెప్పాడు. ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉందో వాళ్ల మీదే బిగ్ బాంబ్ వేస్తారు అని గణేశ్ పంచ్ పేల్చగా, నాకు తెలుసు అంటూ చమత్కరించాడు కౌషల్.
 
ఇది ముగిశాక నాని సభ్యులందరికీ సరదా సరదా టాస్క్‌లు ఇచ్చి, కడుపుబ్బా నవ్వేలా చేసాడు. తదనంతరం ఈరోజు మరో ఎలిమినేషన్ ఉందని నాని ట్విస్ట్ ఇచ్చారు. సామాన్యుల కోటాలో వచ్చిన మరో వ్యక్తి నూతన్ నాయుడు మరోమారు ఎలిమినేట్ అయ్యారు. వెళ్తూ వెళ్తూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి, ఈ వారం మొత్తం హౌస్‌లో అందరి ప్లేట్‌లు కడగాలనే బిగ్ బాంబ్‌ను దీప్తిపై వేసి వెళ్లారు. కాంపిటీషన్ టఫ్ కావడంతో ఒక్కో వారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది.