మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (13:55 IST)

వినాయక చవితి విశిష్టత.. గణనాధుని కృప అంటే అదే...

విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుని జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశేషమైన విశిష్టత ఉంది. ఆదిదంపతుల ప

విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుని జన్మదినమే వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశేషమైన విశిష్టత ఉంది. ఆది దంపతుల ప్రథమ కుమారుడైనా గణపతిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. గణనాధుని కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయి.
  
 
ఈ పర్వదిన ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అనేక ప్రాంతాలలో గణపతి నవరాత్రులు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ఇంటింటా గణపతి బొమ్మలను వివిధ రకాలైన పువ్వులతో, పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 
 
ముంబై, పూణె, హైదరాబాద్ వంటి నగరాల్లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమంలో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. భారతీయ సంప్రదాయంలో జరుపుకునే పండుగల్లో వినాయకచవితిది అగ్రస్థానం. గత కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహాల తయారీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ఈ విగ్రహాల తయారీలో హితమైన రంగులను వాడుతున్నారు. దీంతో పలు తటాకాలు, నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి.