రిలయన్స్ జియో ఫోన్ 2 బుకింగ్స్.. ఫీచర్స్ ఏంటంటే...

రిలయన్స్ జియో ఫోన్ 2 బుకింగ్స్ ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఫోను ధరను రూ.2999గా నిర్ణయించారు. జూలైలో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించినట్టుగానే ఈ ఫోన్‌ను మా

jio phone 2
pnr| Last Updated: మంగళవారం, 14 ఆగస్టు 2018 (17:19 IST)
రిలయన్స్ జియో ఫోన్ 2 బుకింగ్స్ ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఫోను ధరను రూ.2999గా నిర్ణయించారు. జూలైలో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించినట్టుగానే ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. జియో ఇప్పటికే ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో టెలికాం రంగంలో విప్లవానికి తెర లేపిన జియో తొలుత 1500 రూపాయల ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
 
ఇప్పుడు జియో ఫోన్2 పేరుతో మరో ఫోన్‌ను సంస్థ వినియోగదారులకు అందించనుంది. ఈ ఫోన్ ధర రూ.2,999. ఆగస్టు 15 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. జియో వెబ్‌సైట్‌లో గానీ, మై జియో యాప్ నుంచి గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఇప్పటికే రిలయన్స్ జియో ప్రకటించింది. 
 
తొలుత జియో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీ కనిపిస్తుంది. అందులో 'గెట్ నౌ' అనే ఆప్షన్‌ను ఎంచుకోగానే వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్‌, చిరునామా, తదితర వివరాలను పొందుపరచాలి. అంతటితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. జియో ఫోన్2ను ఆన్‌లైన్‌లోనే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా డబ్బు చెల్లించవచ్చు. 
 
అయితే జియో ఫోన్ 2ను బుక్ చేసుకున్న కస్టమర్లకు ఆ ఫోన్లను ఎప్పుడు డెలివరీ చేస్తారో ఆ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ బుక్ చేసుకున్న వారికి వీలైనంత త్వరగానే ఫోన్లను డెలివరీ చేయవచ్చని రిలయన్స్ ప్రతినిధులు చెబుతున్నారు. 
 
ఇక జియో ఫోన్2 ఫీచర్ల విషయానికొస్తే... ఈ ఫోన్ 2.4 అంగుళాల డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోఎల్‌టీఈ, వీవోవైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్‌ఎం రేడియో తదితర ఫీచర్లను అందిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :