మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (16:56 IST)

బిగ్ బాస్‌ హౌస్‌లో బూతు పురాణం, అమ్మాయిలు కింద మీదా పడి దొర్లి మరీ కొట్టుకున్నారు (Video)

రికార్డు టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళుతున్న రియాల్టీ షో బిగ్ బాస్ 4. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 సక్సెస్ సాధించాయి. ఈ నాలుగవ సీజన్ ఎలా ఉంటుందో అనుకున్నారు. అయితే.. స్టార్టింగ్ లో ఆశించిన స్ధాయిలో మెప్పించలేపోయినా.. రేటింగ్‌లో మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళుతుంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్‌లో కొత్త కొత్త గేమ్‌లు ఆడించడం.. పోటీలు పెట్టడం మామూలే.
 
ఈ షోలో కూడా కొత్త ఆటలతో కంటెస్టెంట్ల మధ్య పోటీ పెట్టి షోపై ఇంట్రస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ గేమ్స్‌లో కంటెస్టంట్ల మధ్య తిట్లు మరీ ఎక్కువ అయి ఒక్కోసారి బూతు పురాణం మొదలవుతుంది. అవును.. బిగ్ బాస్ హౌస్‌లో గత రెండు రోజులుగా రణరంగంలా మారింది.
 
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ‘ఉక్కు హృదయం టాస్క్’ ఇంటి సభ్యుల మధ్య పెంట పెట్టింది. రోబో- మనుషులు రెండు టీంలుగా విడిపోయి.. ఆటలో ఎలాగైనా గెలిచేందుకు కొట్లాటకు దిగుతున్నారు. దివిని మనుషులు టీం కిడ్నాప్ చేయడంతో రచ్చ కొట్లాట వరకూ వెళ్లింది. తిట్టుకోవడం పాటు బూతు పురాణం మొదలైంది బిగ్ బాస్ హౌస్‌లో.
 
అమ్మాయిలు కింద మీదా పడి దొర్లి మరీ కొట్టుకున్నారు. రోబోల టీం నుంచి అవినాష్ వచ్చి మనుషుల టీంతో మాటలు కలిపాడు. చార్జింగ్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. కుదరదని చెప్పడంతో రోబోలకు చార్జింగ్ పెట్టుకోవడం ఎలా అన్నదానిపై ఆలోచనలు చేశారు. ఇక అవినాష్... అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ని ముగ్గులోకి దింపి మెల్లగా మాటలు కలిపి... చార్జింగ్ పెట్టుకున్నాడు.
 
అవినాష్ చేసిన పనితో రాజశేఖర్ మాస్టర్ మైండ్ బ్లాక్ అయ్యింది. పక్కన కూర్చుని నమ్మక ద్రోహం చేస్తావారా అవినాష్.. లైఫ్‌లో నీతో మాట్లాడనురా.. నాశనం అయిపోతారు మీరు’ అంటూ శాపనార్థాలు పెట్టారు రాజశేఖర్ మాస్టర్. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్‌లో బూతులు.. శాపనార్ధాలతో హాట్ టాపిక్‌గా నిలిచింది.