మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (19:47 IST)

బిగ్ బాస్ హౌస్‌లో ప్రమాదం.. పొట్ట మజిల్ పట్టేసుకోవడంతో కీర్తి ఇబ్బందులు..

Bigg Boss 6
Bigg Boss 6
బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారం హౌస్‌లో గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ కావడం కోసం హౌస్ మెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. టాస్కుల కోసం ఎగబడుతున్నారు. కంటెస్టెంట్స్ శక్తికి మించి పోరాడుతూ ఉండడంతో కొందరు గాయాలపాలవుతున్నారు. ఇక రీసెంట్ గా కీర్తి కూడా ప్రమాదానికి గురైంది. ఒక క్షణం ఆమె అందర్నీ భయపెట్టేసింది అనే చెప్పాలి. 
 
మొదటివారం బాలాదిత్యా కెప్టెన్ గా చాలా ఈజీగానే సెలెక్ట్ అయ్యాడు అని చెప్పవచ్చు. కానీ బిగ్ బాస్ రెండవ వారం మాత్రం కంటెస్టెంట్స్ అందరికీ కూడా చాలా బలమైన టాస్కులను అయితే ఇస్తున్నాడు. 
 
ఇక మొత్తంగా కెప్టెన్ పోటీదారులుగా నిలవడానికి అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడుతున్నారు. ఇప్పటికే చలాకి చంటి టాస్క్‌లో గెలిచి మొదటి కెప్టెన్ కంటెండర్‌గా నిలిచాడు. బేబీ బొమ్మ టాస్క్‌లో అర్జున్ కళ్యాణ్, ఫైమా, కీర్తి భట్, ఇనయా సుల్తానా ఆరోహి గెలిచి తదుపరి రౌండ్‌ కు సెలెక్ట్ అయ్యారు. 
 
అయితే రెండో కంటెండర్ గా నిలిచేందుకు ఈసారి బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ గెలవాలని చాలెంజ్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్‌లో మొదటి వారమే వెళ్ళిపోతుంది అనుకున్నా ఇనయా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఛాన్స్ కూడా వదిలిపెట్టకూడదు అని కీర్తి భట్‌తో గట్టిగానే పోరాడింది. 
 
ఒకరినొకరు తోసుకునే క్రమంలో అయితే పోరాటం మరింత సీరియస్‌గా మారుతున్న సమయంలోనే కీర్తికి ఒక్కసారిగా పొట్ట మజిల్ పట్టేసుకోవడంతో నొప్పితో చాలా ఇబ్బంది పడింది. అక్కడే కింద కూర్చుని శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడింది. 
 
ఇక ఏమైందో ఏమో అని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక మెల్లగా ఆమె ఊపిరి పీల్చుకొని కాస్త విశ్రాంతి తీసుకోగానే సెట్ అయింది. ఇక ఇనయా సుల్తానా ఆ రౌండ్‌లో గెలిచినట్టు ప్రకటించారు. ఆమె రెండో కంటెండర్ ఎంపిక అయింది.