మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (17:38 IST)

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా కొత్త సినిమా

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. కాకతీయ ఇన్నోవేటివ్స్ దొండపాటి సినిమాస్ నిర్మిస్తున్న తొలి సినిమా పూజా కార్యక్రమం మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమి రోజున యాదాద్రిలో జరిగింది. 
 
కొత్త తరహా కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెప్తున్నారు. దర్శకులే నిర్మాతలైతే కంటెంట్ విషయంలో కసరత్తు జరుగుతుందనే దానికి నిదర్శనంగా ఈ సినిమా ఉంటుందంటున్నారు. 
 
హైదరాబాద్లో జరిగే రెగ్యులర్ షూటింగ్ టైమ్‌లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.