సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (11:45 IST)

బిగ్ బాస్ నాలుగో సీజన్.. ఎలిమినేషన్ ఫీవర్.. ఈ వారం ఎవరు..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. శనివారం వచ్చిందంటేనే నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లకి ఎలిమినేషన్ భయం పట్టుకుంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ చివరి దశకి వచ్చేసింది. మరికొన్ని రోజులు మాత్రమే కొనసాగనున్న ఈ షో నుండి బయటకు వచ్చేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ తప్పదు కాబట్టి ఎవరో ఒకరు బయటకు వచ్చేస్తారు. ఈ వారం నామినేషన్లలో ఆరుగురు సభ్యులున్నారు. వారందరిలో నుండి సొషల్ మీడియా స్టార్స్ అయిన అరియానా, హారిక డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది.
 
అరియానా అతి, చేసేదేమీ లేకపోయినా అరవడం వగైరా వంటివన్నీ ఆమెని డేంజర్ జోన్లోకి తీసుకువచ్చాయి. ఇక హారిక డేంజర్ జోన్లో ఉండడానికి కారణం ఒక రకంగా బిగ్ బాస్ అనే చెప్పాలి. మొదటి నుండి ఏమీ చేయకపోయినా ఆమెని కాపాడుకుంటూ వస్తున్న బిగ్ బాస్, ఈసారి కూడా ఆమెకి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. దాంతో హారిక డేంజర్ జోన్లోకి వచ్చింది. మరి ఆరియానా, హారిక.. వీరిద్దరిలో హౌస్ నుండి బయటకు వెళ్లేదెవరో చూడాలి.