శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (17:09 IST)

ఎన్టీఆర్‌ను కించపరచలేదు.. బిగ్‌బాస్ గురించే మాట్లాడాను: మానస హిమవర్షి

టాలీవుడ్‌లో తన అభిమాన నటుడు ఎన్టీఆరేనని, గతంలో ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పానని కూడా మానస గుర్తు చేశారు. తాను కేవలం బిగ్‌బాస్ షో గురించే మాట్లాడానని.. ఎక్కడ ఎన్టీఆర్‌ను కించపరిచేలా కామెంట్స్

రొమాన్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన మానస హిమవర్షి.. ఇటీవల విడుదలైన వంశీ ఫ్యాషన్ డిజైనర్‌లో నటించింది. కాటమరాయుడులో శివబాలాజీకి జంటగా కనిపించింది. అయితే తాజాగా మానస వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్’ షో మొదటి ఎపిసోడ్ పూర్తయిన అనంతరం ‘ఈ షోలో నేను భాగం కాకపోయినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని సోషల్‌ మీడియాలో హిమవర్ష పోస్ట్ చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఎన్టీఆర్‌ను కించపరిచారని ఆయన ఫ్యాన్స్ మండిపడ్డారు. దీంతో మానస జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరచలేదని మానస హిమవర్ష వివరణ ఇచ్చారు. 
 
టాలీవుడ్‌లో తన అభిమాన నటుడు ఎన్టీఆరేనని, గతంలో ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పానని కూడా మానస గుర్తు చేశారు.  తాను కేవలం బిగ్‌బాస్ షో గురించే మాట్లాడానని.. ఎక్కడ ఎన్టీఆర్‌ను కించపరిచేలా కామెంట్స్ చేయలేదని తెలిపారు. ఎన్టీఆర్‌ను కించపరిచానంటూ తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్నారు. తాను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయలేదని స్పష్టం చేశారు.