ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (16:32 IST)

అజ్ఞాతంలోకి వెళ్లలేదు.. ఇంట్లోనే ఉన్నాను.. పోలీసులకు పల్లవి ప్రశాంత్

pallavi prashanth
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌పై హైదరాద్ నగర పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆయన కనిపింకుండా పోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై పల్లవి ప్రసాద్ స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, మా ఇంట్లోనే ఉన్నానని తెలిపారు.
 
కాగా, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన తర్వాత జరిగిన గొడవల నేపథ్యంలో అతడిపైన కూడా కేసు నమోదైంది. దీంతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉందని అతడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారనే ప్రచారం బుధవారం ఉదయం నుంచి జరిగింది. 
 
ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తాను ఇంట్లోనేనే ఉన్నానని వివరించారు. తన గురించి మీడియాలో వస్తున్నదంతా తప్పుడు సమాచారం అని పల్లవి ప్రశాంత్ స్పష్టంచేశాడు. 
 
తాను ఏ తప్పు చేయలేదని, ఇతరులు చేసినవి తనపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అప్రదిష్టపాల్జేసేందుకే ఇలాంటివన్నీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఫోన్ జోలికి వెళ్లలేదని, అది స్వచాఫ్‌లోనే ఉందని పల్లవి ప్రసాద్ వివరణ ఇచ్చారు.