ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (17:16 IST)

బాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన సాహో... ఎలాగంటే? (Video)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీకి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వస్తుండ‌డం విశేషం. ఈ మూవీ రిలీజై వారం రోజులు అయిన‌ప్ప‌టికీ నేటికి బాక్సాఫీసు వద్ద జెట్ స్పీడ్‌లో పరుగులు తీస్తోంది. సాహో విడుదలై 7 రోజులు అవుతున్నా కలెక్షన్లు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. 
 
తొలి రోజు నుంచి వసూళ్లు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే 110 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇది అక్క‌డ వారికి షాకింగ్ ఉంది. ఎందుకంటే... ఈ మూవీకి అక్క‌డ క్రిటిక్స్ 1.5 రేటింగ్ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ బాలీవుడ్లో సాహో 110 కోట్లు వ‌సూలు చేయ‌డం అంటే... అది కూడా నెగిటివ్ టాక్‌తో ఈ రేంజ్ క‌లెక్ష‌న్స్ అంటే.. ప్ర‌భాస్‌కి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది.
 
ఇక ఈ మూవీ  ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మ‌రి... ఫుల్ ర‌న్లో సాహో ఇంకెంత క‌లెక్ట్ చేస్తాడో..?