ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (07:27 IST)

బోయ‌పాటి క‌థ చెప్ప‌డు రెండు సీన్స్ చెబుతాడు అంతే - బాల‌కృష్ణ‌

balakrishna-srikanth-boyapati
ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను నాకు క‌థ మొత్తం చెప్ప‌డు. రెండు స‌న్నివేశాలు చెబుతాడంటే. మా ఇద్ద‌రి మ‌ధ్య అంత స‌ఖ్య‌త వుంది. అఖండ‌కు అలానే జ‌రిగింది. అంని నంద‌మూరి బాల‌కృష్ణ తెలియ‌జేశారు. గురువారం రాత్రి విశాఖ‌ప‌ట్నంలో అఖండ విజ‌యోత్స‌వ స‌భ జ‌రిగింది. అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. 
 
బాల‌కృష్ణ మాట్లాడుతూ, క‌రోనా స‌మ‌యంలో పెద్ద విజ‌యాన్ని ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఈ విజ‌యం కొండంత దైర్యాన్నిచ్చింది. అభిమానుల్ని పొంద‌డం పూర్వ జ‌న్మ సుకృతం. నా నుంచి ఏమీ ఆశించ‌రు. విజ‌యాలు వ‌చ్చినా ప‌రాజ‌యాలు వ‌చ్చినా నా వెన్నంటే వుంటూ ప్రోత్స‌హిస్తూ వుంటారని తెలిపారు.
 
బోయపాటి శ్రీ‌ను తెలుపుతూ, ప్రేక్ష‌కుడికీ థియేట‌ర్‌కు బంధం తెగిపోతుంద‌నే త‌రుణంలో మంచి సినిమాను తీస్తే వెన్నంటే వుంటార‌ని నిరూపించిన సినిమా ఇది. మామూలుగా మంచి పాత్ర చేస్తున్నారంటే న‌టుడి ఉత్సాహ‌ప‌డ‌తాడు. కానీ బాల‌య్య పాత్ర చేస్తున్నారంటే ఆ పాత్రే ఉత్సాహ‌ప‌డుతుంది. ఈ సినిమాలో దేవుడి గురించి, మంచి గురించి చెప్పాం. వాక్ శుద్ధి, ఆత్మ‌శుద్ది వున్నారు చెబితే జ‌నాల్లోకి వెళ‌తాయి. అవి వున్నాడే బాల‌య్య‌బాబు అని తెలిపారు. ఇంకా నిర్మాత ర‌వీంద‌ర్‌రెడ్డి, శ్రీ‌కాంత్ త‌దిత‌రులు త‌మ ఆనందాన్ని పంచుకున్నారు.