బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శనివారం, 4 డిశెంబరు 2021 (10:56 IST)

సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారుపేరు

కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య మృతికి సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం ప్ర‌క‌టించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హఠాన్మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను అంటూ, త‌న‌దైన శైలిలో బాల‌య్య స్పందించారు. 
 
 
‘‘సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారుపేరు. అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రిగా రోశయ్య పేరొందారు. చేపట్టిన ప్రతి పదవికీ ఆయ‌న‌ వన్నె తెచ్చారు. రోశయ్య మృతితో గొప్ప అనుభవం గల నాయకుడిని తెలుగు జాతి కోల్పోయింది. కంచు కంఠం, నిండైన రూపం, పంచె కట్టుతో తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా ఉండేవారు. రోశయ్యగారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.’’ అంటూ హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ త‌న సంతాపాన్ని తెలిపారు.