ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 మార్చి 2017 (21:34 IST)

హవ్వ... సి. కళ్యాణ్ కుమారుడు 'చిల్లర' పని... స్విమ్మింగ్ పూల్ దగ్గర సీసీ కెమేరాకు చిక్కాడు...

ఇదివరకు ఓ సామెత చెప్పారు. మనుషులకు కోట్లలో ధనం వున్నా కొందరిలో వున్న చిల్లర పనులు మాత్రం పోవు. వాళ్ల బుద్ధి వక్రంగా వుంటే వంకరగానే పోతుంటుంది. ఇదే ప్రముఖ నిర్మాత చిల్లర కళ్యాణ్ కుమారుడి విషయంలోనూ జరిగింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... సి.కళ్యాణ్ కుమారుడ

ఇదివరకు ఓ సామెత చెప్పారు. మనుషులకు కోట్లలో ధనం వున్నా కొందరిలో వున్న చిల్లర పనులు మాత్రం పోవు. వాళ్ల బుద్ధి వక్రంగా వుంటే వంకరగానే పోతుంటుంది. ఇదే ప్రముఖ నిర్మాత చిల్లర కళ్యాణ్ కుమారుడి విషయంలోనూ జరిగింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... సి.కళ్యాణ్ కుమారుడిపై ఓ చోరీ కేసు నమోదు కావడమే. 
 
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెం.12 లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి గురువారం తన కుమారుడితో కలిసి ఫిలిం నగర్ కల్చరల్ సెంటరుకు వచ్చి, అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసేందుకు తన పర్సును అక్కడే పెట్టి స్నానం చేస్తున్నాడు. స్నానం ముగించుకుని పైకి వచ్చి చూసేసరికి పర్స్ మిస్సయ్యింది. 
 
మరో షాక్ ఏంటంటే... పర్స్ మిస్సయిన గంటలోపే తన పర్సులో వున్న డెబిట్, క్రెడిట్ కార్డుల మనీ వేరే ఖాతాలోకి వెళ్లిపోయింది. దాంతో షాక్ తిన్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా యాక్సిస్ బ్యాంక్ కార్డు నుంచి రూ. 1.82 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు నుంచి రూ. 27600 మొత్తం చిల్లర వరుణ్ కుమార్ ఖాతాలోకి జమ అయినట్లు తేలింది. సీసీ కెమేరాల్లోనూ పర్సును కొట్టేసింది వరుణ్ కుమారే అని గుర్తించారు. దీనితో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.