సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (12:09 IST)

వెబ్ సిరీస్ పేరుతో నగ్నంగా సినిమా తీశారు : సినీ నటి ఫిర్యాదు

వెబ్‌ సిరీస్ పేరుతో నగ్నం(బ్లూ ఫిల్మ్)గా తీశారంటూ ఓ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివవరాలను పరిశీలిస్తే, బాలీవుడ్‌కు చెందిన 26 యేళ్ల యువ నటికి సినిమాలో అవకాశం ఇస్తామ

వెబ్‌ సిరీస్ పేరుతో నగ్నం(బ్లూ ఫిల్మ్)గా తీశారంటూ ఓ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివవరాలను పరిశీలిస్తే, బాలీవుడ్‌కు చెందిన 26 యేళ్ల యువ నటికి సినిమాలో అవకాశం ఇస్తామని సినీదర్శకుడు ఉపేంద్ర రాయ్, కాస్టింగ్ డైరెక్టర్ రాజన్ అగర్వాల్‌లు నమ్మించారు. 
 
దీనికంటే ముందుగా తాము ఓ వెబ్‌సిరీస్ తీస్తున్నట్టు అందులో తొలుత నటించాలని కోరారు. దీనికి ఆ నటి సమ్మతించింది. దీంతో షూటింగ్ నిమిత్తం మధ్ దీవులకు తీసుకెళ్లారు. అక్కడ వెబ్ సిరీస్‌ పేరుతో నగ్నంగా, అశ్లీలంగా చిత్రీకరించారనీ, తనతో చిత్రీకరించిన చిత్రాన్ని పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారంటూ ఆ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, కాస్టింగ్ డైరెక్టర్ రాజన్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చిత్ర దర్శకుడైన ఉపేంద్ర రాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.