సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (09:34 IST)

ఛాయ్ వాలే వ్యాపారంలో నయనతార, విఘ్నేశ్ శివన్ పెట్టుబడి

లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు. అందులో భాగంగా తాజాగా ఆమె చెన్నైకు చెందిన ఛాయ్ వాలే అనే ఛాయ్ వ్యాపారం చేసే కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ వ్యాపారంలో నయన్ తన ప్రియుడు విఘ్నేష్ కలిసి కొంత ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
ఇకపోతే, నయనతార ప్రస్తుతం నెట్రికన్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మూడో కన్ను పేరుతో విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో ఈ సినిమా హాట్ స్టార్‌లో డైరెక్ట్ రిలీజ్ అవుతోంది. నెట్రికన్ ఆగస్టు 13న హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. 
 
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌లో నయనతార అంధురాలిగా అదరగొట్టింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నెటిజన్స్‌ను బాగానే ఆకర్షిస్తోంది. నెట్రికన్ సినిమాను విఘ్నేష్ శివన్ నిర్మిస్తోండగా.. మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా. కంటి చూపు లేని యువతి తన వినికిడి శక్తిని ఉపయోగించి సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకుంది అనేది కథ. కొరియన్ చిత్రం 'బ్లైండ్'కు రీమేక్‌గా వస్తోంది.
 
ఇక నయనతార నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ హీరోగా వస్తున్న అన్నాత్తేలో నటిస్తోంది. ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో అన్నయ్యగా దీపావళికి వస్తోంది. దీంతో పాటు కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తుంది నయన్. సమంత ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా చేస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు.
 
మరోవైపు నయన ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి వెబ్ సిరీస్‌లో నయన్ కీలకపాత్రలో కనిపించనుందని తాజా సమాచారం. వీటితో పాటు నయన్ తెలుగులో చిరంజీవి లూసీఫర్ రీమేక్ చిత్రంలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో నయన్ కీలకపాత్రలో కనిపించనుందని అంటున్నారు.