శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (13:56 IST)

కోర్కె తీర్చమని పోలీసులు ఒత్తిడి చేశారు : నటి శృతి

పెళ్లి పేరుతో పలువురు యువకులు, కోటీశ్వరులను మోసం చేసిన తమిళ నటి శృతి సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో అరెస్టు తర్వాత విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తనను లైంగిక కోర్కెలు తీర్చాలంటూ వేధించ

పెళ్లి పేరుతో పలువురు యువకులు, కోటీశ్వరులను మోసం చేసిన తమిళ నటి శృతి సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో అరెస్టు తర్వాత విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తనను లైంగిక కోర్కెలు తీర్చాలంటూ వేధించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పైగా, ఈ వేధింపులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేయనున్నట్టు ప్రకటించింది.
 
చెన్నైకు చెందిన కోలీవుడ్ నటి శృతి. ఈమె నటిగా కంటే కూడా ఫేస్‌బుక్ వేదికగా వివాహాల పేరుతో పలువురిని మోసం చేసిన విషయంలో మంచి గుర్తింపు ఉంది. ఇలా శృతి వలలో పడి మోసపోయిన ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... శృతితో పాటు ఆమె తల్లిని, మరో ముగ్గురుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో శుక్రవారం ఆమె షరతులతో కూడిన బెయిలుపై విడుదలైంది. 
 
జైలు నుంచి విడుదలైన తర్వాత శృతి మాట్లాడుతూ, పెళ్లి పేరుతో తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే, విచారణ పేరుతో పోలీసులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారనీ, లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించారనీ, దీనిపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేయనున్నట్టు ప్రకటించింది.