శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 17 జులై 2018 (10:42 IST)

కావాలంటే అవి చూపిస్తానంటోన్న శ్రీరెడ్డి... ఎగబడుతున్న తమిళ జర్నలిస్టులు...

తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింట్ కౌచ్ వ్యవహారంలో శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు అగ్రహీరోలతో పాటు కొంతమంది సైడ్ యాక్టర్ల పేర్లు చెప్పి ఇరకాటంలో నెట్టింది. కొంతమంది శ్రీరెడ్డికి మద్ధతుగా నిలిస్తే మరికొంతమంది మాత్రం

తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింట్ కౌచ్ వ్యవహారంలో శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు అగ్రహీరోలతో పాటు కొంతమంది సైడ్ యాక్టర్ల పేర్లు చెప్పి ఇరకాటంలో నెట్టింది. కొంతమంది శ్రీరెడ్డికి మద్ధతుగా నిలిస్తే మరికొంతమంది మాత్రం ఆమెను పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలను పక్కన బెట్టి తమిళ సినీపరిశ్రమపై పడింది శ్రీరెడ్డి. 
 
అది కూడా డ్యాన్స్ మాస్టర్ లారెన్స్, డైరెక్టర్ మురుగదాస్, నటుడు శ్రీరామ్ పేర్లను బయటపెట్టింది. వీరు ముగ్గురు హీరోయిన్లను అవకాశాలివ్వాలంటే వారితో ఒకరోజు గడపాలి. అందులోను వారి కొన్ని షరతులు పెడతారు. రహస్య ప్రాంతానికి రమ్మంటారు. నన్ను వీరు ముగ్గురూ రమ్మన్నారు. వారు నన్ను పిలిచినట్లు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. కావాలంటే అవి చూపిస్తానంటోంది శ్రీరెడ్డి. దీనితో తమిళ జర్నలిస్టులు ఆమె ఇంటర్వ్యూల కోసం పోటీపడుతున్నారు. 
 
మరోవైపు శ్రీరెడ్డి వ్యాఖ్యలతో తమిళ సినీ పరిశ్రమలో చర్చ మొదలైంది. తమిళ సినీ సంఘం అధ్యక్షుడు విశాల్ వెంటనే స్పందించాలంటూ ప్రముఖ దర్సకుడు టి.రాజేందర్ డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. అంతేకాదు శ్రీరెడ్డి ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారో వారు కూడా స్పందించి తమిళ సినీపరిశ్రమపై మచ్చ లేకుండా చూడాలన్నారు రాజేందర్. 
 
దీంతో విశాల్ రంగంలోకి దిగి శ్రీరెడ్డి వ్యవహారంపై ఏ విధంగా మీడియా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో పడ్డారట. ఈలోపుగా తమిళ సినీ జర్నలిస్టులు మాత్రం శ్రీరెడ్డి ఫోనును ఖాళీ లేకుండా తినేస్తున్నారట. కొందరైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం... టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వస్తారా అని అడుగుతున్నారట. మొత్తమ్మీద ఇప్పుడు శ్రీరెడ్డి విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.