సుందర్ సిపై పడిన శ్రీరెడ్డి.. ఛాన్సిస్తా.. కానీ కాంప్రమైజ్ చేయాలన్నాడు.. ఆ తర్వాత?

సినీ నటి ఖుష్భూ భర్త, నటుడు అయిన సుందర్ సిపై శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించింది. శ్రీరెడ్డి తమిళలీక్స్‌లో తాజాగా సుందర్ సి. చిక్కుకున్నారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ.. సినీ ప్రముఖులపై విమర

Selvi| Last Updated: సోమవారం, 16 జులై 2018 (13:04 IST)
సినీ నటి ఖుష్భూ భర్త, నటుడు అయిన సుందర్ సిపై శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించింది. శ్రీరెడ్డి తమిళలీక్స్‌లో తాజాగా సుందర్ సి. చిక్కుకున్నారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ.. సినీ ప్రముఖులపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి, కోలీవుడ్ సినీ రంగంపై దృష్టి మళ్లించిన సంగతి తెలిసిందే.


మొన్నటికి మొన్న మురుగదాస్, శ్రీకాంత్‌, రాఘవ లారెన్స్‌లపై ఫేస్‌బుక్‌లో లీకులు చేసిన శ్రీరెడ్డి, విశాల్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పింది. తాజాగా అగ్ర దర్శకుడు సుందర్ సిపై పడింది. 
 
హైదరాబాదులో ఓ థ్రిల్లర్ సినిమా షూటింగ్ జరిగినప్పుడు... ఆ ప్రాంతానికి నిర్మాత గణేష్ తనను తీసుకెళ్లాడు. సుందర్ సికి పరిచయం చేశాడు. అక్కడ తన స్నేహితుడైన కెమెరామెన్ సెంథిల్ కుమార్‌ను కలిశానని.. ఆ సమయంలో సుందర్ సి. తనకు మంచి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీరెడ్డి తెలిపింది. కానీ సినీ ఛాన్స్ కావాలంటే.. తనను కాంప్రమైజ్ చేయాలని కోరాడని ఆరోపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసునని బాంబ్ పేల్చింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సుందర్ సిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఖుష్బూ లాంటి అందమైన భార్య వుండగా.. ఇదంతా అవసరమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకా సుందర్ సిపై శ్రీరెడ్డి ఆరోపణలు కోలీవుడ్‌ ప్రముఖులకు షాక్‌నిచ్చాయి. ఇదిలా ఉంటే.. శ్రీరెడ్డి ఆరోపణలపై సుందర్ సి స్పందించారు. శ్రీరెడ్డి చెప్పిన మాటల్లో నిజం లేదన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై కేసు పెడతానని.. శ్రీరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని సుందర్ సి వెల్లడించారు.  దీనిపై మరింత చదవండి :