సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జులై 2018 (13:36 IST)

నడుముతో పాటు 'ఆ' భాగాలు చూపించమన్న హీరో.. శ్రీరెడ్డి

సినీ ఇండస్ట్రీలో ఇతరుల సహాయంలేకుండా తమ స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారిలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ ఒకరు. అలాంటి రాఘవపై క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర

సినీ ఇండస్ట్రీలో ఇతరుల సహాయంలేకుండా తమ స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారిలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ ఒకరు. అలాంటి రాఘవపై క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించిన శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.
 
'ఒక రోజు తన స్నేహితులతో కలిసి లారెన్స్‌ మాస్టర్‌ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ గోల్కొండ హోటల్‌లో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. అనంతరం నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చి.. కొత్తగా ఇక్కడికి వచ్చే చాలా మందికి, పేద పిల్లలకి సహాయం అందిస్తున్నానని చెప్పారు. 
 
నిజంగా నాకు అది చాలా మంచిగా అనిపించింది. అ తర్వాత లారెన్స్‌ తన నిజస్వరూపం చూపించారు. నా నడుముతో పాటు ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు. నాతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడు. అనంతరం లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో లారెన్స్‌తో కొంత కాలం పాటు స్నేహంగా ఉన్నాను. ఇందులో బెల్లంకొండ సురేష్ చివరికి విలన్ అయ్యారన్నారని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది.