శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 17 జులై 2021 (22:31 IST)

'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ గుండెపోటుతో కన్నుమూత

పలు హిందీ సినిమాలు, సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి, జాతీయ అవార్డు గ్రహీత సురేఖా సిక్రీ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్​లో బామ్మగా నటించి, గుర్తింపు తెచ్చుకున్న సురేఖా సిక్రీ(75) తుదిశ్వాస విడిచారు. సిక్రీ గుండెపోటుతో మరణించినట్లు ఆమె సహాయకుడు వివేక్ సిద్వానీ వెల్లడించారు. 
 
గత ఏడాది సెప్టెంబర్​లో బ్రెయిన్​స్ట్రోక్​తో ఆస్పత్రిలో చేరిన సురేఖ.. కొన్నిరోజుల తర్వాత డిశ్చార్జ్​ అయ్యారు. కానీ అప్పటి నుంచి ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారని వివేక్ చెప్పారు. మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ఈమె.. 'తమాష్', 'మమ్మో', 'సలీమ్ లంగ్డే పే మత్ రో', 'జుబేదా', 'బదాయీ హో' సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 
 
బాలికా వధూ(తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') సీరియల్​తో ప్రతి ఇంటికి చేరువైంది. గతేడాది నెట్​ఫ్లిక్స్​లో రిలీజైన 'ఘోస్ట్​ స్టోరీస్' ఆంతాలజీలో సురేఖ చివరగా కనిపించారు.