గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (20:31 IST)

గంగవ్వకి ఐదేళ్ల వయసులోనే బాల్య విహహం.. బిగ్ బాస్‌లో యమా క్రేజ్..(video)

బిగ్ బాస్ కంటిస్టెంట్ గంగవ్వకి ఐదేళ్ల వయసులోనే బాల్య విహహం జరిగింది. ఆ తర్వాత కొన్నేళ్లకు దుబాయ్ వెళ్లిన గంగవ్వ భర్త డబ్బు పంపకపోగా అసలు ఉన్నాడా లేడా అనే సంగతి కూడా తెలియలేదు. తన కన్న బిడ్డకు సరైన వైద్యం అందక చనిపోతే దిక్కుతోచక తానే తన బిడ్డకి అంత్యక్రియలు చేసింది. ఇక మిగితా పిల్లల కోసం వ్యవసాయం చేస్తూ వారిని పెంచి పోషించింది. 
 
గంగవ్వకి 50 ఏళ్ల జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఒంటిగానే ఎదుర్కొంది. అలాంటి గంగవ్వకి 50 ఏళ్ల వయసులో స్టార్‌డమ్ వచ్చింది. కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. నిర్మలమైన మనసు పల్లె అమాయకత్వం గంగవ్వని మరింత ఎత్తుకి తీసుకెళ్లింది. 
 
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం లంబాడీపల్లె. తెలంగాణలో ఉండే పల్లె అందాలకు సాంప్రదాయాలు అన్ని ఈ గ్రామంలో స్పష్టంగా కన్పిస్తాయి. ఇలాంటి మారుమూల పల్లె నుంచి వచ్చిన ఓ వృద్ధురాలే ఇప్పుడు ఓ యూట్యూబ్ స్టార్‌గా మారిపోయింది.
 
ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ ఫోర్‌లో ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఆమెకు పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నారు. హౌస్‌లో ఉన్న సభ్యులందరికీ వస్తున్న ఓట్లు ఒక్క గంగవ్వకి వస్తున్నట్లుగా మారిపోయింది వ్యవహారం. అంతలా ఇప్పుడు గంగవ్వ ఫేమస్ అయిపోయింది. అందరి మనసులు దోచుకుంది గంగవ్వ. దీంతో ఆమె స్వగ్రామం జగిత్యాల జిల్లా లంబాడీపల్లెలో ఆమె సన్నిహితులు బంధువులు ఆనందంతో మునిగిపోయారు. 
 
లంబాడీపల్లెలో స్థానిక యువకులు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. రకరకాల కాన్సెప్ట్స్‌తో అందరిని ఆకట్టుకుంది ఈ యూట్యూబ్ ఛానెల్. అందులో ఓ అవ్వ క్యారెక్టర్ కోసం తమ గ్రామంలో ఉన్న గంగవ్వని సెలెక్ట్ చేసుకున్నారు. వీడియోలో ఆమె డైలాగ్ టైమింగ్ యాక్టింగ్ అంతా అందరిని ఎంతో ఆకట్టుకున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ఉన్నప్రతి ఒకరికి గంగవ్వ యాక్టింగ్ తమ ఇంట్లో ఉండే నానమ్మ అమ్మమలను గుర్తుచేస్తాయి. అలా కేవలం గంగవ్వ కోసమే యూట్యూబ్ లో వీడియోలు చూసినవారు లక్షల్లోఉన్నారు. గంగవ్వ నటించిన వీడియోలో మిలియన్స్ వ్యూస్‌ని రోజుల్లో చేరుకున్నాయి. 
 
''మనమీద మనకు నమ్మకం ఉంటే ఏ పని చేసినా మంచిగనే ఉంటాం'' - ఇదీ గంగవ్వ సిద్ధాంతం. ఇలానే అందరూ ఆలోచిస్తే… గంగవ్వలా ఏదైనా సాధిస్తారనడంలో అతిశయోక్తి లేదు. అదన్నమాట గంగవ్వ స్టామినా.